ఈమె పేరు శృతి.. తమిళ నటి.. పాపం అమాయకులైన మగవారి జీవితాలతో ఆడుకుంది..!

ఈమె పేరు శృతి.. అలియాస్ మైథిలీ వెంకటేష్.. చెన్నైలో సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. నిజ జీవితంలో కూడా నటించడం.. మోసం చేయడం నేర్చుకుంది. పాపం అమాయకులైన మగవాళ్ళకు పెళ్ళి ఆశలు చూపించి మోసం చేసింది. ఇప్పుడు కటకటాల పాలైంది. తనను పెళ్ళి చేసుకోబోయేది ఈ అమ్మాయే.. ఈ అమ్మాయే అని ఆమె ఫోటోలు తన స్నేహితులకు చూపించడంతో వారు ఆమె ఓ నటి అని చెప్పడంతో ఈమె మోసం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రుతి, ఆమె తల్లి, సోదరుడితో పాటు తండ్రిగా ఫొటోలో పోజిచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రుతి ‘ఆది పొన ఆవని’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.


చెన్నయ్ కు సినీ నటి శృతి జి.బాలమరుగన్ అనే ఎన్నారై వద్ద నుంచి రూ.41 లక్షలు లాక్కుంది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడుతో పాటు శ్రుతికి తండ్రిగా నటించిన వ్యక్తిని నిన్న అరెస్టు చేశారు. సేలంకు చెందిన వ్యక్తి జి.బాలమరుగన్, జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను అవివాహితుడు. 2017 మేలో అతను తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ఉంచాడు. ఇదే వెబ్ సైట్ ద్వారా శ్రుతికి, అతనికి పరిచయమైంది. తన పేరును మైథిలీ వెంకటేశ్ గా అతనికి పరిచయం చేసుకున్న శ్రుతి, అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.

ఇక డబ్బుల కోసం సినిమా కథలు చెప్పడం మొదలుపెట్టింది శృతి. తన ఆరోగ్యం బాగాలేదని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తనకు శస్త్రచికిత్స చేయాలని చెప్పి డబ్బులు లాగడం మొదలుపెట్టింది. కట్టుకోబోయే అమ్మాయే కదా అని అతడు ఎంత అడిగితే అంత పంపేవాడు. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్యం కూడా బాగుండలేదని, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని బాలమురుగన్ ని నమ్మించింది. ఈ మాటలు నిజమని నమ్మిన బాలమురుగన్ పలు వాయిదాల్లో మొత్తం రూ.41 లక్షల వరకు ఆమెకు పంపించాడు. 2017 మే నుంచి ఈ ఏడాది జనవరి 1 లోపు ఈ మొత్తం ఆమెకు పంపించాడు.

ఇక శృతి తనకు కాబోయే భార్య అని ఆమె ఫొటోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు స్నేహితులకు చూపించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె ఓ నటి అని బయటపెట్టేశారు. దీంతో షాక్ తిన్న బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here