`అలాంటి`మూవీ అని తెలీక! అబ్బాయిలు హెల్మెట్ పెట్టుకుని, అమ్మాయిలు స్కార్ఫ్‌ క‌ట్టుకుని

చెన్నై: `ఇరుట్టు అర‌యిల్ ముర‌ట్టు కుత్తు` అని ఓ త‌మిళం మూవీ. మొన్న శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హీరో మ‌రెవరో కాదు. ఒక‌ప్ప‌టి త‌మిళ్ స్టార్ హీరో కార్తీక్ కుమారుడు గౌత‌మ్ కార్తీక్‌. హీరోయిన్లు కూడా మ‌న‌కు తెలిసిన ముఖాలే. హిట్ టాక్ తెచ్చుకుంది. వాల్‌పోస్ట‌ర్లు చూస్తే హార‌ర్ ప్ల‌స్ కామెడీ జోన‌ర్‌లో తీసి ఉంటార‌ని అనుకున్నారు ప్రేక్ష‌కులు.

పోలోమంటూ మార్నింగ్ షోకు వెళ్లారు. థియేట‌ర్ల మీద వాలిపోయారు. సినిమా చూస్తూ, చూస్తూ సిగ్గుతో చితికిపోయారంటే న‌మ్మండి! ఎందుకంటే- ప‌క్కా అడ‌ల్ట్ మూవీ అది. హార‌ర్ జోన‌రే. అందులో డౌట్ లేదు. అడ‌ల్ట్ ప్ల‌స్ హార‌ర్ జోన‌ర్‌లో తీశారు. కోరిక‌లు తీర‌కుండానే చ‌నిపోయిన ఓ యువ‌తి.. ఆత్మ‌గా మారి, కామ కోరిక‌ను తీర్చుకోవాల‌నుకోవ‌డం ఈ సినిమా లైన్‌.

కామ పిశాచి అనుకోవ‌చ్చు. సినిమా మొత్తం హీరోతో కోరిక తీర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుందా దెయ్యం. దీనికి కామెడీని మిక్స్ చేశారు. ఇందులోని సీన్లు కూడా హాట్ హాట్‌గా ఉంటాయి. ఆ సినిమా అలాంటిద‌ని తెలీక థియేట‌ర్ల మీద వాలిన ప్రేక్ష‌క ప‌క్షులు బిక్క‌చ‌చ్చిపోయాయి.

సినిమా నిండా డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఉండ‌టంతో అమ్మాయిలు త‌ట్టుకోలేక‌పోయారు. థియేట‌ర్ బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత టీవీ ఛాన‌ళ్ల వారు గొట్టాలు ప‌ట్టుకుని నిల్చుంటారు కదా? అంతే- వారిని చూసేట‌ప్ప‌టికీ హెల్మెట్లు పెట్టుకున్నారు. ముఖానికి క‌ర్చీఫ్ క‌ట్టుకుని మ‌రీ బ‌య‌ట‌ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here