మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ బుగ్గ నిమిరిన గ‌వ‌ర్న‌ర్‌! దీని ఫ‌లితం?

చెన్నై: ఆ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ పేరు ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌. `ద వీక్‌`లో స్పెష‌ల్ క‌రెస్పాండెంట్‌. ఆమె బుగ్గ నిమిరుతున్న‌ది మ‌రెవ‌రో కాదు.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్‌. ఆయ‌న ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశం ముగిసిన సంద‌ర్భంగా త‌న ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ బుగ్గను ఇదిగో ఇలా నిమిరారు.

 

దీని ఫలితం ఏమిటంటే.. ఇలా చేసినందుకు ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పుకోవాల్సి వ‌చ్చింది. త‌న మ‌న‌వ‌రాలిగా భావించి, ఆమె బుగ్గ నిమిరాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్ త‌న బుగ్గ నిమిరుతున్న ఫొటోను ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దెబ్బ‌కు అది టాప్ ట్రెండింగ్‌గా మారింది.

నిజానికి- బ‌న్వ‌రీలాల్ పురోహిత్‌పై సెక్స్ స్కాండ‌ల్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌దురై కామ‌రాజ్ నాడ‌ర్ యూనివ‌ర్శిటీకి అనుబంధంగా ప‌నిచేస్తోన్న దేవాంగ ఆర్ట్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ నిర్మ‌లా దేవి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఆ కాలేజీ విద్యార్థినుల‌తో లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఆ ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డానికి బ‌న్వ‌రీలాల్ ఈ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను ఏర్పాటు చేశారు. సెక్స్ స్కాండల్ ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకున్న అనంత‌రం.. లేచి వెళ్లిపోతూ.. త‌న ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ బుగ్గ గిల్ల‌డంపై మ‌రోమారు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here