దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పైరసీ వెబ్ సైట్ ‘తమిళ రాకర్స్’ ని పట్టించేసిన విశాల్..!

తమిళ్ రాకర్స్.. ఈ పైరసీ వెబ్ సైట్ దెబ్బకు ఎన్నో సినిమాలు నష్టపోయాయి. కొందరు నిర్మాతలు అయితే దయచేసి మా సినిమాను తొందరగా విడుదల చేయకండి ప్లీజ్ అంటూ అడుకున్నారు కూడానూ.. దక్షిణ భారతదేశంలో ఓ రేంజిలో ఈ వెబ్ సైట్ పైరసీని ప్రోత్సహించింది. సినిమాల రిలీజ్ డేట్ ను విడుదల చేస్తే.. ఈ వెబ్సైట్ నిర్వాహకులు.. సినిమా పైరసీ ప్రింట్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే వాళ్ళు.. అలా పాతుకుపోయిన ఈ వెబ్సైట్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.


తమిళ రాకర్స్, తమిళ బాక్స్ అడ్మిన్ అయిన ప్రభుని అరెస్ట్ చేశారు. ఇతనితో పాటూ మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. tamilrockers.in, tamilrockers.ac, tamilrockers.me, tamilrockers.co, tamilrockers.is ఈ లింకులలో పైరసీ సినిమాలను అప్లోడ్ చేసేవారు. విజుపురం మరియు నెల్లై ప్రాంతాలలో ఈ ముగ్గురి నిందితులని కేరళ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిపైన కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారించి మిగతా వివరాలు రాబట్టనున్నారు. ఈ వ్యాపారం ద్వారా తమిళ రాకర్స్ కోటి రూపాయలు డీవీడీ రాకర్స్ 75 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.

వెబ్సైట్లో పెడుతున్న వ్యాపార ప్రకటనల ద్వారా పైరసీ ముఠాను పట్టుకున్నామని వివరించారు. అందుకు ముఖ్యంగా తమిళ సినీ నిర్మాతల మండలి తరఫున హీరో విశాల్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన ఓ కంపెనీ తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో అడ్వర్టైజ్మెంట్ ను ఇచ్చింది. ఆ కంపెనీ వారితో విశాల్ మాట్లాడి.. ఎవరికి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చారు.. ఎలా ఇచ్చారు అన్నది కనుక్కున్నారు. అలా కనుక్కున్న తర్వాత నిర్వాహకులను ఐటీ విభాగం పట్టేసుకుంది. ఇన్ని రోజులూ ఎంతో మంది నిర్మాతలకు నిద్ర పట్టకుండా చేసిన తమిళ రాకర్స్ టీమ్ ను అరెస్ట్ చేయడంతో సినిమా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here