పెద్ద త‌ల‌కాయ‌లు, బిగ్‌షాట్స్ ప‌క్క‌న‌ లేకుండా మ‌హిళా జ‌ర్న‌లిస్టులు రాత్రిపూట నిద్ర‌పోగ‌ల‌రా?

చెన్నై: `పెద్ద త‌ల‌కాయ‌లు ప‌క్క‌న లేకుండా మ‌హిళా జ‌ర్న‌లిస్టులు రాత్రిపూట సుఖంగా నిద్ర‌పోగ‌ల‌రా? మీడియాలో ప‌నిచేసే మ‌హిళ‌లు గ‌వ‌ర్న‌ర్‌నే ప్ర‌శ్నిస్తారా? వాళ్లెంతటి ప‌తివ్ర‌త‌లో నాకు తెలుసు. త‌మిళ‌నాడు మీడియాలో ప‌నిచేసే వాళ్లు చిల్ల‌ర గాళ్లు. నేను కొంద‌రికి మాత్ర‌మే మ‌ర్యాద‌నిస్తా. మిగిలిన వాళ్లంతా అలాంటి వాళ్లే. త‌మిళ‌నాడు మీడియా మొత్తం క్రిమిన‌ల్స్‌, రాస్కెల్స్‌, బ్లాక్‌మెయిల‌ర్ల చేతిలో ఉంది. మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ (ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్) బుగ్గ నిమిరిన గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ త‌న చేతుల‌ను ఫినాయిల్‌తో క‌డుక్కోవాలి..`

 

ఇదీ త‌మిళ‌నాడు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎస్. వె. శేఖ‌ర్ చేసిన వ్యాఖ్య‌నాలు. ఆయ‌న త‌న ఫేస్‌బుక్‌లో ఇలాంటి ఛండాల‌పు వ్యాఖ్యానాల‌ను చేశారు. ఈ కామెంట్ల‌కు ఓ హెడ్డింగ్ కూడా పెట్టారు.. `మ‌దురై యూనివ‌ర్శిటీ, గ‌వ‌ర్న‌ర్ అండ్ ద వ‌ర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గ‌ర్ల్‌..` ఇదీ ఆయ‌న పెట్టిన హెడ్‌.

దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో వాటిని డిలిట్ చేశారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్‌.. ల‌క్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు బుగ్గ నిమిర‌డం, త‌రువాత ఆయ‌న ఈ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్ప‌డం తెలుసు క‌దా? యూనివ‌ర్శిటీల్లో కంటే మీడియా కార్యాల‌యాల్లోనే మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

చ‌దువురాని వాళ్లంతా త‌మిళ‌నాడులో మీడియా ప్ర‌తినిధులుగా త‌యార‌య్యార‌ని చెప్పారు. దీనికి ఆమె (లక్ష్మీ సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌) కూడా మిన‌హాయింపు కాద‌ని అన్నారు. బ‌న్వ‌రీలాల్ ఆమెకు క్ష‌మాప‌ణ చెప్ప‌డం పాపం ఆయ‌న‌కు న‌చ్చ‌లేదేమో. అందుకే జ‌ర్న‌లిస్టుల‌ను బండ‌బూతులు తిడుతూ ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్ల‌కు నిర‌స‌న‌గా త‌మిళ‌నాడు మీడియా సంఘాలు చెన్నైలోని బీజేపీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న చేస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here