కడుపునొప్పి నయంచేస్తాడని వెళితే అత్యాచారం చేశాడు.. ఇప్పుడు పాతికేళ్ళు జైలుశిక్ష అనుభవించనున్నాడు..!

కడుపు నొప్పి ఉంటే.. ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి.. ఏ డాక్టరునో కలవాలి.. కానీ ఓ వివాహిత కుటుంబసభ్యులు ఓ బాబాని కలిసింది. ఆ బాబా తనలోని వక్ర బుద్ధిని బయటపెట్టాడు. ఆ మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో అతడికి ఏకంగా 25ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది.

మధుర లోని బృందావనంలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. హత్రాస్ కు చెందిన బాధిత మహిళ 2017 జూలైలో బాబా ద్వారకాదాస్ ను ఆశ్రయించింది. తనకు కొంతకాలంగా కడుపునొప్పిగా ఉన్నట్టు తెలిపింది. తన భర్త, నాలుగేళ్ల కుమార్తెతో ఆమె ఆ బాబా దగ్గరకు వెళ్ళింది. ఆమె నొప్పిని తగ్గిస్తానని చెప్పి రాత్రి 10 గంటల తరువాత ప్రత్యేక పూజలు చేయాల్సి వుంటుందని చెప్పాడు. ఆపై ఆమె భర్తకు ఓ దీపం ఇచ్చి, దీపం ఆరిపోయిన తరువాతే లోపలికి రావాలని ఆదేశించాడు.

అతడి మాటలు నమ్మిన బాధితురాలి భర్త దీపం ఆరిపోయేదాకా బయటనే ఉన్నాడు. లోపల ఉన్న ఆమెను అత్యాచారం చేసి చెడు కలిగించే భూతాలను తరిమివేసినట్టు చెప్పాడు. ఆ తరువాత మరోసారి ఆమెను రేప్ చేశాడు. ‘నిబు పూజ’లో ఇది కూడా భాగమేనని, అంగీకరించకుంటే కుటుంబమంతా చనిపోతారని బెదిరించాడు. జరిగిన ఘటనను భర్తకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు దొంగ బాబాకు 25 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 వేలు జరిమానా విధిస్తున్నామని చెప్పారు. దాన్ని చెల్లించకుంటే మరో 27 నెలలు జైలు శిక్షను అనుభవించాలని తీర్పును ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here