రివర్స్ షాక్‌! టీడీపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

అమ‌రావతి: బ‌హుశా రివ‌ర్స్ షాక్ అంటే ఇదేనేమో! ఇన్నాళ్లూ ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్తోంటే జ‌గ‌న్‌కు షాక్ అంటూ బోలెడు వార్త‌ల‌ను చూశాం. చ‌దివాం. ఇప్పుడు రివ‌ర్స్ షాక్ మొద‌లైంది. అది కూడా ఎన్నిక‌ల ముంగిట్లో.

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు రానున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశానికి గ‌ట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి. శనివారం ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధినేత‌ వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేర‌బోతున్న‌ట్టు య‌ల‌మంచిలి ర‌వి ప్ర‌క‌టించారు.

విజ‌య‌వాడ‌లో ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారథి వద్ద జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సీనియ‌ర్ల‌కు తెలుగుదేశం పార్టీలో ఏ మాత్రం గౌర‌వం లేద‌ని ఆయ‌న అన్నారు. ఇన్నాళ్లూ పార్టీని అంటి పెట్టుకుని, క‌ష్ట కాలంలో ఆదుకున్నాన‌ని, అలాంటి తన‌కు పార్టీ అధినేత ద‌గ్గ‌రి నుంచి గానీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ద్ద నుంచి క‌నీస గౌర‌వం లభించ‌లేద‌ని చెప్పారు.

ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట మార్చ‌డంతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ‌, నిస్పృహ ఆవ‌రించింద‌ని అన్నారు. గ‌తంలో హోదా వ‌ద్దు, ప్యాకేజీ ముద్దు అన్న వారు ఇప్పుడెందుకు హోదా కావాలంటూ నాట‌కాలు ఆడుతున్నార‌ని జ‌నం నిల‌దీస్తున్నార‌ని చెప్పారు.

దీనికి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా ఉద్యమాన్ని స‌జీవంగా ఉంచ‌గ‌లిగింది ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here