జన్మభూమి కార్యక్రమంలో జీడిగింజలో.. చిల్లాటలో.. అంటూ డ్యాన్సులు..!

జన్మభూమి కార్యక్రమం అట్టహాసంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఈ జన్మభూమి కార్యక్రమాల పేరుతో జరిగిన జల్సా కార్యక్రమాలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పెడుతున్నారు.

రాజా ది గ్రేట్ సినిమాలోని జీడి గింజలో.. చిల్లాటలో పాటకు శ్రీకాళహస్తి లోని జన్మభూమి కార్యక్రమంలో అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో స్థానిక నాయకులంతా కలిసి డ్యాన్స్ లు చేశారని.. ఇవన్నీ జన్మభూమి కార్యక్రమాలా లేక డ్యాన్స్ కార్యక్రమాలా అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

గున్న గున్న మామిడి …శ్రీకాళహస్తి జన్మభూమి సభ లో డాన్సులు ..Srikalahasti janmabhumi programme Lo dance by Tdp municipal chairman and councillors along with municipal commissioner…

Venkat Reddy Karmuruさんの投稿 2018年1月11日(木)

ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మభూమి ముగింపు సందర్భంగా సంప్రదాయబద్ధంగా కోడిపందేలు ఆడడం వివాదం అవుతోంది. ఈ వేడుకల్లో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఇద్దరూ చెరొక పుంజును రంగంలోకి దించి సదరదాగా ఆడారు. కోడిపందేలపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజాప్రతినిధులు కోడి పందేలు ఆడటం వివాదాస్పదం అయింది.

క్రమశిక్షణకే కట్టుబడి ఉంటాననే చంద్రబాబు నాయుడు ఈ పనులను చేసిన వాళ్ళకు ఏమైనా శిక్షలు విధిస్తాడో.. లేక పట్టించుకోకుండా ఉంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here