ఒకప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్నారు.. ఇప్పుడు మతి భ్రమించింది అంటున్నారు..!

గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అవినీతిని ప్రశ్నించాడు. నారా లోకేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం నాయకులు కట్టకట్టుకుని మాటల దాడి చేస్తున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ మన వాడు అని అన్నారో.. వాళ్ళే ఈ రోజు పవన్ కళ్యాణ్ ను మతి భ్రమించిన వాడు అని అంటున్నారు. మంత్రి నారాయణతో సహా ఎంతో మంది టీడీపీ నాయకులు.. పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో… పవన్ కు మతిభ్రమించిందని ఆయన అన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజల అండ టీడీపీకి మాత్రమే ఉందని పవన్ కళ్యాణే కాదు ఎవరు వచ్చినా టీడీపీకి వచ్చిన ఇబ్బంది లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే అని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. దీన్ని మరిచిపోయి… వెనుక ఏదో ఒక శక్తి చెప్పించినట్టు పవన్ కల్యాణ్ మాట్లాడటం మంచిది కాదని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని మండిపడ్డారు. బీజేపీకి, పవన్ కు మధ్య రాయబారం ఎవరు నడిపారనే విషయం త్వరలోనే తేలిపోతుందని చెప్పారు. చంద్రబాబును, లోకేష్ ను విమర్శించడం సరికాదని అన్నారు. మంచి నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ ను తొక్కేయడం కోసమే… ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. లోకేష్ పై పవన్ నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు.

ఇక మంత్రి నారాయణ మాట్లాడుతూ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ లను విమర్శించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి, కాపులను తాకట్టు పెట్టారని, ఆయన వల్ల కాపు కులస్తులు ఇరవై ఏళ్లు వెనక్కి పోయారని విమర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ ప్రసంగించారని, టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతిపరులంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ చక్కగా, నిజాయతీగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here