అనిత‌..టీటీడీ బోర్డు స‌భ్య‌త్వానికి దూరం!

అమ‌రావ‌తి: ఎప్పుడూ హ్యాండ్‌బ్యాగ్‌లో బైబిల్‌, శిలువ‌ను వెంట తీసుకెళ్తుంటాన‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించిన పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనితకు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో స‌భ్యురాలిగా నియమించ‌డం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె వెన‌క్కి త‌గ్గారు.

తాను ఆ ప‌ద‌విని స్వీక‌రించ‌బోన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుకు లేఖ రాశారు. త‌న విజ్ఞ‌ప్తిని మ‌న్నించాల‌ని ఆమె కోరారు. క్రైస్త‌వ స‌భ‌ల‌కు ముఖ్యఅతిథిగా వెళ్లే అల‌వాటు ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు ఏకంగా టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డంపైనా వివాదాలు చెల‌రేగుతున్నాయి.

దీన్ని అటు ముఖ్య‌మంత్రి గానీ, ఇటు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ గానీ ప‌ట్టించుకోలేదు. త్వ‌ర‌లోనే ఆయ‌న టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సిద్ధం చేసుకుంటున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు స్వ‌యానా వియ్యంకుడు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుమార్తె పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు కోడ‌లు.

దీనితో త‌న వియ్య‌కుండికి టీటీడీ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వాలని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెచ్చిన ఒత్తిడి మేర‌కే చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో- క్రైస్త‌వ సంఘాలతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని, హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్‌, శిలువ ఉంటాయ‌ని వెల్ల‌డించిన అనిత‌కు స‌భ్య‌త్వం క‌ల్పించ‌డం ప‌ట్ల నిర‌స‌న చెల‌రేగుతోంది. చివ‌రికి- ఆ వ్య‌వ‌హారం అనిత‌కు టీటీడీ బోర్డు స‌భ్య‌త్వ ప‌ద‌విని దూరం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here