సినిమా వాళ్ళ మీద ఏది పడితే ఆ కామెంట్లు చేశాడు.. మరి ఇప్పుడేమో..!

సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కావాలని చెబుతూ ముందుకు రావడం లేదని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డబ్బులు తింటోన్న సినీ పరిశ్రమ, ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిరసన చేయట్లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఏమి అందామని ఈ మాటలు అన్నారో కానీ అతడి మీద భారీగా విమర్శలు చెలరేగాయి. సినిమా పరిశ్రమకు చెందిన ఎంతో మంది అతడి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఇంకొందరు అయితే సినిమా హీరోలంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని.. అలాంటిది ఈ మాట ఎలా అంటావని.. ముందు మీ బాలకృష్ణను నోరు తెరవమని చెప్పండి అంటూ పలువురు విమర్శించడంతో రాజేంద్రప్రసాద్ తాను చేసిన విమర్శలను వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు.

తాను ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అండగా నిలవాలని చేసిన వ్యాఖ్యలను సినిమావారు అర్థం చేసుకోవాలని అన్నారు. సినిమా వాళ్లు ప్రత్యేకహోదా కోసం పోరాడితే ఏపీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే అలా అన్నానని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ, టీడీపీ ఎంపీ మురళీ మోహన్, సినీ నటి కవిత, పోసాని కృష్ణ మురళి లాంటి వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలని కొన్ని నెలల క్రితమే తాము పోరాటం చేద్దామని అనుకున్నామని.. కానీ మీరే వద్దు అని చెప్పారని సంపూర్ణేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో స్పష్టంగా రాశారు.

ఇది అవమానం కాదు….అన్యాయం కాదు…మరేంటి?? ఈ ఫోటో గురించి మీడియాలో వస్తున్న వార్తలు, మరియు శ్రేయోభిలాషులు నంజు…

Sampoornesh Babuさんの投稿 2018年3月22日(木)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here