మెడ‌లో ప‌చ్చ‌కండువా..వైఎస్ఆర్ సీపీ క్యాంటీన్ వ‌ద్ద భోజ‌నం!

అనంత‌పురం: తెలుగుదేశం పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న పుట్టిన‌రోజు నాడు ధ‌ర్మ‌పోరాట ధీక్ష చేప‌ట్టారు. తెలుసు క‌దా! అదే రోజు, ఆ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయ‌కులు కూడా దీక్ష‌లో కూర్చున్నారు. ఆ సంద‌ర్భంగా తీసిన ఫొటోలు ఇవి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

తెలుగుదేశం పార్టీ నాయ‌కుల దీక్ష‌కు హాజ‌రైన ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు.. త‌మ ఆక‌లిని తీర్చుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ఆశ్ర‌యించారు. అనంత‌పురం జిల్లాలోని హిందూపురంలో క‌నిపించిన దృశ్యాలు అవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జి నవీన్ నిశ్చ‌ల్ ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.

ఆ ఒక్క‌రోజు మాత్ర‌మే కాదు.. వారంలో అన్ని రోజులూ ఈ క్యాంటీన్ అందుబాటులో ఉంటుంది. అయిదు రూపాయ‌ల‌కే భోజనాన్ని అందిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌వీన్ నిశ్చ‌ల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి బాల‌కృష్ణ‌పై ఓడిపోయారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల నిలువెత్తు చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ వ‌ద్ద‌ తెలుగుదేశం కండువాను మెడ‌లో వేసుకున్న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు భోజ‌నం చేస్తోన్న ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here