26 సంవత్సరాల టీచర్.. 14 ఏళ్ల విద్యార్థితో ఎలా ప్రవర్తించిందో బయటపడింది.. ఊచలు లెక్కపెడుతోంది..!

పాశ్చాత్య దేశాల్లో టీచర్లు మరీ ఎంతకు తెగిస్తున్నారో తెలిపే ఘటన ఇది.. 26 సంవత్సరాల స్కూల్ టీచర్ 14 ఏళ్ల కుర్రాడికి స్నాప్ చాట్ లో ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు పంపింది.. అంతేకాకుండా ఆమె కార్ లో అతడితో శృంగారంలో పాల్గొనింది. ఇది ఆ కుర్రాడి తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆమెను జైల్లో తోశారు పోలీసులు.

 

స్టెఫానీ పీటర్సన్ అనే 26 ఏళ్ల స్కూల్ టీచర్ కు అప్పటికే పెళ్ళి అయింది. అయినప్పటికీ 14 సంవత్సరాల కుర్రాడితో అఫైర్ నడపడం మొదలుపెట్టింది. అతన్ని లైంగికంగా లొంగదీసుకుంది. 2016 నుండి ఫ్లోరిడా లోని స్కూల్ లో ఆమె పనిచేస్తూ ఉంది. ఆ స్కూల్ లో ఉన్న ఆ కుర్రాడితో ఆమె సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ కుర్రాడితో ప్రామిస్ కూడా చేయించుకుంది. ఆ కుర్రాడికి అసభ్యకరమైన ఫోటోలను పంపడం.. అతడిని కూడా పంపమని అడగడం ఇలా చేస్తూ ఉండేది. ఆ తర్వాత అతన్ని తమ ఇంటికి కూడా పిల్చుకొని వెళ్ళింది. కొద్ది రోజులకు స్కూల్ లో నుండి ఆమె కొన్ని కారణాల వలన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పటికీ ఆ కుర్రాడితో రిలేషన్ షిప్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఇన్ని పాడు పనులు చేస్తుంటే ఆ కుర్రాడి మార్కులు కూడా బాగా తగ్గుతూ వచ్చాయి.

ఇతర టీచర్లకు అనుమానం వచ్చి కుర్రాడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. వారు అతన్ని విచారించగా జరిగిన ఘటనలు మొత్తం బయటపెట్టాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి మొబైల్ ఫోన్లు చూడగా ఎన్నో సాక్ష్యాలు వారికి దొరికాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here