వెళ్ళి టీచర్ ను కొట్టిన విద్యార్థి.. అప్పుడు టీచర్ ఏమి చేశాడంటే..!

సాధారణంగా టీచర్ ముందు గట్టిగా మాట్లాడడానికి కూడా మనం చాలా భయపడుతూ ఉంటాం. కానీ కొందరు మాత్రం డైరెక్ట్ గా కొట్టడానికి, తిట్టడానికి వెళ్లిపోతుంటారు. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది. ఓ విద్యార్థి టీచర్ మీద దాడి చేయడానికి వెళ్ళాడు. వెంటనే ఆ టీచర్ అతన్ని అడ్డుకోవడంతో పాటూ.. ఎదురుదాడి చేశాడు.. ఒకానొక దశలో అతన్ని ఎత్తి కిందకు పడేశాడు టీచర్..! కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూడండి..!

30 సెకెండ్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన అమెరికాలో జరిగిందని భావిస్తున్నారు. తన చైర్ నుండి లేచి వచ్చిన విద్యార్థి.. టీచర్ చెస్ట్ మీద గుద్దాడు. వెంటనే టీచర్ అతడిని వెనుకకు నెట్టేశాడు. ఆ తర్వాత కూడా ఆ విద్యార్థి టీచర్ మీద దాడి చేయబోయాడు. వెంటనే టీచర్ అతన్ని ఎత్తి కిందపడేయడమే కాకుండా.. పిడిగుద్దులు కురిపించారు. క్లాస్ లోని ఇంకొంతమంది వచ్చి అడ్డుకోడానికి ప్రయత్నించినా ఇద్దరూ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన ఏ స్కూల్ లో జరిగిందో.. గొడవపడిన ఈ ఇద్దరికీ ఎటువంటి శిక్షను యాజమాన్యం విధించిందో తెలీలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here