చుట్టూ జ‌నం..మ‌ధ్య‌లో కోహ్లీ!

టీమిండియా కేప్టెన్‌ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధానిలోని ప్రముఖ మ్యూజియం మేడం టుస్సాడ్స్ లో కోహ్లీ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. దీంతో ఈ మ్యూజియంకు వస్తున్న సందర్శకులు కోహ్లీ మైనపు విగ్రహం పక్కన నిలబడి ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. తన మైనపు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కోహ్లీ తన అభినందనలతో పాటు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని మ్యూజియం నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here