సూర్య‌కిర‌ణాలు ఆ బాలిక ఒంటిపై ప‌డితే..!

ఇండోర్‌: ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టే ఛాన్స్ లేదు. సూర్య‌కిర‌ణాలు సోకితే ఆ బాలిక శరీరం పొడిబారిపోతుంది. చ‌ర్మం నుంచి రక్తం కారుతుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ వ్యాధితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్‌కు చెందిన వేదికా గుప్తా బాధ‌ప‌డుతోంది. ఆ బాలిక శరీరాన్ని చూసి అందరూ స్నేక్ గర్ల్ అని పేరుపెట్టారు.

అరుదుగా వ‌చ్చే చ‌ర్మ వ్యాధి సోకిందా బాలిక‌కు. దీనితో కొన్నాళ్లుగా ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. సూర్యకిరణాలు ఆ చిన్నారి ఒంటిపై పడితే రక్తం రావడం ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే చర్మం పొడిబారిపోతుంది. ఆమె తల్లిదండ్రులు ట్రీట్ మెంట్ కోసం అనేకమంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు.

ఎవరూ ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. ఇలాంటి కేసు ఒకటి ఇంగ్లండ్ లో ఉందని.. ట్రీట్ మెంట్ చేస్తే నయం అవుతుందని కొందరు డాక్టర్లు చెబుతున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమ‌త ఆ త‌ల్లిదండ్రుల‌కు లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here