ట్యూష‌న్ నుంచి ఇంటికెళ్తోన్న విద్యార్థిని కిడ్నాప్‌..గ్యాంగ్‌రేప్‌..దారుణ‌హ‌త్య‌

ట్యూష‌న్ నుంచి ఇంటికి వెళ్తోన్న విద్యార్థినిని కిడ్నాప్ చేశారు కొంద‌రు యువ‌కులు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. న‌గ‌ర శివార్ల‌లో నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌న‌కు పాల్ప‌డ్డారు.

ఈ దారుణం వెలుగులోకి రాకుండా ఉండ‌టానికి గొంతునులిమి హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌ష‌హ‌ర్‌లో చోటు చేసుకుంది. ఆ విద్యార్థిని మైన‌ర్‌.

బులంద్‌ షహర్‌లో ప్ల‌స్ టు తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మంగళవారం కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. ట్యూషన్ నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న యువతిని.. కొందరు యువకులు కారులో కిడ్నాప్‌ చేశారు.

రెండు రోజులు పాటు యువతిపై అత్యాచారం జరిపి.. ఆపై హత‍్య చేశారు. శవాన్ని న‌గ‌ర శివార్ల‌లోని చెరువు వ‌ద్ద పడేసి వెళ్లిపోయారు. కిడ్నాప్‌ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారం మేరకు పోలీసులు అయిదుమంది అనుమానితులను అరెస్ట్‌ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here