క్లైమాక్స్ సీన్‌లో విల‌న్ డెన్‌లోకి హీరో ఎంట‌ర్ అయిన‌ట్టు..!

న్యూయార్క్‌: ఖ‌రీదైన షెవ‌ర్లె ఎక్వినాక్స్ కారు అది. ఆ కారేసుకుని ఝామ్మంటూ డ్రైవింగ్ టెస్ట్‌కు వ‌చ్చిందో యువ‌తి. డ్రైవింగ్ చేస్తూ కాదు. బ్యాక్ సీట్లో కూర్చుని. ఆ కారును ఆ యువ‌తి సోద‌రుడు డ్రైవ్ చేస్తూ ఆర్టీఓ కార్యాల‌యానికి వచ్చాడు. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మీదికి కారును తీసుకొచ్చిందా యువ‌తి. టెస్ట్ స్టార్ట్ కాగానే కాస్త బెదిరిన‌ట్టుంది.

ఎదురుగా ఎనిమిది అంకె చూడ‌గానే ఇంకాస్త బెదిరిపోయుంటుంది. బ్రేక్‌కు బ‌దులుగా యాక్సిలేట‌ర్ నొక్కి ఉంటుంది. శ‌ర‌వేగంగా దూసుకెళ్లిందా కారు. ఎదురుగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్ స్టేష‌న్‌ను గుద్ది పారేసింది. తెలుగు సినిమాల క్లైమాక్స్ సీన్‌ల‌ల్లో.. విల‌న్ డెన్‌లోకి హీరో ఎంట‌ర్ అవుతాడే అలాగ‌న్న మాట‌.

ఈ ఘ‌ట‌న అమెరికాలోని మిన్నెసోటాలో చోటు చేసుకుంది. ఆ వేగానికి ఏకంగా ఎగ్జామ్ సెంట‌ర్‌లోకి దూసుకెళ్లిందా కారు. దాని దెబ్బ‌కు గోడ‌, దాని వెనుక ఉన్న అద్దాలు భ‌ళ్లుమంటూ ప‌గిలిపోయాయి. కారు కూడా బాగా డ్యామేజ్ అయింది.

ఆ గాజు ముక్క‌లు మీద ప‌డి, డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్ స్టేష‌న్‌లో ప‌రీక్ష రాస్తోన్న ఓ మ‌హిళ గాయ‌ప‌డింది. ఆ యువ‌తి పేరు తెలియ‌ట్లేదు గానీ.. ఆమెకు 17 సంవ‌త్స‌రాలు ఉన్నాయ‌ని, మోంటిసెల్లో నుంచి వ‌చ్చిన‌ట్టు బ‌ఫెలో పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here