బాలయ్య బాబును ‘మా’ నుండి సస్పెండ్ చేయాలట..!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర సినిమా సెల్ డిమాండ్ చేసింది. అందుకు కారణం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే..!

నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ నందమూరి బాలకృష్ణను ‘మా’ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర సినిమా సెల్ కోరింది. అలాగే ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ సినిమా సెల్ నిర్ణయించినట్టు సెల్ కన్వీనర్ సీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బకాయి పడిన మొత్తాన్ని ఎన్టీఆర్ స్టూడియో నుంచి రాబట్టాలని, లేదంటే జప్తు చేయాలని నరసింహారావు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడిన తర్వాత బాలకృష్ణ చేసిన కామెంట్లకు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక బాలయ్య హిందీలో తిట్టిన తిట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పలు పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణకు వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టారు బీజేపీ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here