ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌..మ‌రో అడుగు ముందుకు!

బెంగ‌ళూరు: దేశంలో ఎన్డీఏ, యూపీఏల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయ‌డానికి పావులు క‌దుపుతున్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు మరో అడుగు ముందుకేశారు. జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) అధినేత, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు.

బెంగ‌ళూరులోని దేవెగౌడ నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కె కేశ‌వ‌రావు, వినోద్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, మిష‌న్ భ‌గీర‌థ ఛైర్మ‌న్ ప్ర‌శాంత్ రెడ్డి ఉన్నారు. వారితో పాటు- బీజేపీకి బ‌ద్ధ శ‌తృవుగా పేరున్న ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా ఈ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం ఆస‌క్తి రేపింది.

ఈ ఉద‌యం 9:45 నిమిషాల‌కు హైద‌రాబాద్ బేగంపేట్ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూర‌కు బ‌య‌లుదేరి వచ్చారు. విమానాశ్ర‌యం నుంచి నేరుగా దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవేగౌడతో చర్చిస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చి, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ కొద్దిరోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా- ఆయ‌న ఇదివ‌ర‌కే కోల్‌క‌తలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌త బెన‌ర్జీతో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సారి దేవెగౌడ‌ను క‌లిశారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.  వ‌చ్చేనెల 12వ తేదీన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రగ‌నుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నప్ప‌టికీ దేవేగౌడ.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here