కేసీఆర్ కుటుంబంలో విషాదం: విష‌ణ్ణ వ‌ద‌నంతో..!

హైద‌రాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న రెండో సోద‌రి విమలాబాయి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 82 సంవ‌త్స‌రాలు. కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరి విమలాబాయి భౌతిక కాయాన్ని కేసీఆర్ సంద‌ర్శించారు. నివాళి అర్పించారు. ఇంట్లో చాలాసేపు విషణ్ణ వ‌ద‌నంతో గ‌డిపారు. బాల్య‌స్మృతుల‌ను గుర్తు చేసుకున్నారు.

మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లో విమలాబాయి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లి, ఓ అన్న ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here