సింధుకు నగదు బహుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. అందుకు కారణం..!

కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించినవారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతులను ప్రకటించింది. అందరూ ఉన్నారు కానీ వారిలో పీవీ సింధు మాత్రం లేదు..! ఇదే కొత్త వివాదానికి దారితీస్తోంది. గతంలో పిలిచి మరీ సన్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు. 2016 ఒలింపిక్స్ లో పతకం గెల్చినప్పుడు సింధుకు రూ. 5 కోట్ల నగదుతో పాటు హైదరాబాదులో ఇంటి స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది.. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోలేదు.


పీవీ సింధు పేరు నగదు బహుమతుల జాబితాలో లేదు. సైనా నెహ్వాల్ కు రూ. 50 లక్షలు, మరో షట్లర్ సిక్కిరెడ్డికి రూ. 30 లక్షలు, రుత్వికా శివానీకి రూ. 20 లక్షలు, బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ. 25 లక్షల బహుమతులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే డబ్బులు ఇవ్వకపోవడానికి వేరే కారణం చెబుతున్నారు కొందరు అధికారులు. ఆంద్రప్రదేశ్ లో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ పోస్టును తీసుకుంది.. ఏపీ అధికారిణి అయిన సింధుకు నగదు బహుమతిని ఇచ్చేందుకు కుదరదని కొందరు అధికారులు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం నగదు బహిమతి ఇవ్వడానికి నిరాకరించినట్లు చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here