మంచి పోలీసులు.. 50 తులాలు కాదమ్మా మీ ఇంట్లో పోయింది 62తులాలు.. తీసుకోండి..!

పోలీసుల్లో మరీ ఇంత మంచి పోలీసులా అని అనిపించే ఘటన..! సాధారణంగా బంగారం పోయిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు రికవరీ చేస్తారు. అయితే ఆ రికవరీలో ఎంతో కొంత తక్కువగా బాధితులకు అందుతూ ఉంటుంది. ఎందుకంటే దొంగలు ఆ బంగారాన్ని ఎక్కడైనా అమ్ముకోవడమో.. దాచడమో జరుగుతూ ఉంటుంది. అయితే కంప్లయింట్ లో ఫిర్యాదు చేసిన దానికంటే అంతకు మించి రికవరీ చేసిన దాఖలాలు చాలా తక్కువ.. అయితే అలాంటి ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమ్మా మీ ఇంట్లో పోయింది 50 తులాల బంగారం కాదమ్మా మొత్తం 62 తులాలు అని పోలీసులు బాధితులకు బంగారాన్ని అప్పజెప్పారు.

గోల్డెన్‌ హైట్స్‌ కాలనీలోని మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసంలో ఈనెల 5 తెల్లవారు జామున దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారం మొత్తం ఎత్తుకెళ్లారని, వాటి బరువు సుమారు 50 తులాల బంగారం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కేసులో అబ్దుల్‌ జహీర్‌ అనే 20 ఏళ్ల కుర్రాడిని అదుపులోకి తీసుకోగా మొత్తం బయటకు వచ్చింది. అతని వద్ద నగలు స్వాధీనం చేసుకుని తూకం వేయగా వాటి బరువు 62 తులాలుగా పోలీసులు గుర్తించారు. స్టేషన్ కు చేరుకున్న వారు ఆ నగలన్నీ తమవేనని తెలిపారు. చోరీ జరిగిన ఆందోళనలో పోయిన నగల బరువును కచ్చితంగా చెప్పలేకపోయామన్నారు. బోరబండలో ప్లంబర్‌ గా పనిచేసే జహీర్ ఇలాంటి దొంగతనాల్లో భాగంగా గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here