ఏం గుర్తుకొచ్చి ఆ క‌లెక్ట‌ర్ అలా న‌వ్వారో గానీ.. 40 విధాల చేటు చేసింది!

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి న‌వ్వుల వ్య‌వ‌హారంపై చెల‌రేగిన దుమారం అయిదు రోజులైన‌ప్ప‌టికీ చ‌ల్లార‌లేదు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేసిన త‌రువాత ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల తీరుతెన్నులపై ప్ర‌సంగిస్తూ, ప‌లుమార్లు ఆమె ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. న‌వ్వుకుంటూ దిక్కులు చూస్తూ గ‌డిపారు.

ప్ర‌సంగ పాఠాన్ని త‌ప్పుగా చ‌దివారు. పలుమార్లు త‌డ‌బ‌డ్డారు. ఈ వ్య‌వ‌హారం అంతా లైవ్ ద్వారా టెలికాస్ట్ కావ‌డంతో రాష్ట్రవ్యాప్తంగా విమ‌ర్శ‌లు చెల‌రేగాయి.

దీనితో ప్ర‌భుత్వం వివ‌ర‌ణ కోరింది. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డానికి ఆమ్ర‌పాలి సోమ‌వారం స‌చివాల‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం కార్య‌క్ర‌మం యావ‌త్తూ ఆమ్ర‌పాలి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూనే క‌నిపించారు. ఎక్క‌డా ఆమె హూందాగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖుల‌నూ ఆమ్ర‌పాలి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూనే ప‌ల‌క‌రించారు. కార‌ణం ఏదైనా గానీ.. ఓ ఎఫీషియంట్‌, డైన‌మిక్ క‌లెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్ర‌పాలిని న‌వ్వుల‌పాలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here