తెలుగు యాంకర్ కు లైవ్ లో ‘ఐలవ్ యు’ చెప్పిన కాలర్..!

కొన్ని కొన్ని సార్లు లైవ్ టీవీ షోలలో అనుకోనివి జరుగుతూ ఉంటాయి. కాలర్స్ యాంకర్లతో పిచ్చా పాటీ మాట్లాడుతూ ఏవేవో వాగేస్తుంటారు. అందరికీ హాయ్ చెప్పండి.. ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి.. అంకుల్ కి హాయ్ చెప్పండి.. వరకే ఇప్పటి వరకూ మన తెలుగు ఛానల్స్ లైవ్ షోలలో మాట్లాడడం మనం చూసి ఉంటాం.

కానీ యాంకర్ కు ‘ఐ లవ్ యూ’ చెప్పేంతగా మన కాలర్స్ ఇప్పటిదాకా ఎదగలేదనే అనుకుంటే మాత్రం మన పొరపాటే..! జెమినీ కామెడీ ఛానల్ లో వచ్చే కెవ్వు కామెడీ ప్రోగ్రాంకు అమోఘ్ అనే యువకుడు యాంకర్ గా చేస్తున్నాడు. తన మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అతని లైవ్ ప్రోగ్రాంకు ఇటీవల ఓ అమ్మాయి ఫోన్ చేసింది. తన అక్కతో పాటూ షో చూస్తున్నానని చెప్పిన ఈ అమ్మాయి.. లైవ్ లోనే యాంకర్ కు ఐలవ్ యు చెప్పేసింది. దాదాపు నాలుగు నిమిషాల పాటూ ఆ అమ్మాయి చిలిపి మాటలతో యాంకర్ ను నవ్వించి.. చివరికి ‘ఐ లవ్ యు’.. అంటూ ముగించేసింది. ఇంతకూ ఆ అమ్మాయి సీరియస్ గా ఐ లవ్ యు చెప్పిందా.. లేక నిజంగానే చెప్పిందో.. మన కాలర్స్ కూడా ఎదుగుతున్నారండోయ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here