బాబు గారూ.. ఎంపీ మైక్ పట్టుకొని లాగేసిన వీడియో వైరల్ అవుతోంది.. కాస్త చూసుకోండి..!

ఈరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలో జరిగిన జన్మభూమి వేదికపై ఎంపీ అవినాశ్‌రెడ్డి మైక్ ను పట్టుకొని లాక్కోవడం..! మొదట తమ్ముడు అంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయన చివరికి ఉండవయ్యా అంటూ విసుక్కున్నారు. చివరికి అవినాష్ రెడ్డిని మాట్లాడనివ్వకుండా నువ్వు ఏమి చెప్పాలో నాకు రాసివ్వు.. అప్పుడు చూసుకుందాం అని అన్నారంటే ముఖ్యమంత్రి గారికి ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలకు ఇది వేదిక కాదని అవినాష్ రెడ్డి తో చంద్రబాబు అన్నారు.

గండిగోట, చిత్రావతి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి, 85 శాతం పనులు పూర్తి చేసిన ఘనత ధివంగత నేత వైఎస్సార్‌కే చెందుతుందన్నారు. దీంతో చంద్రబాబు ఆయన ప్రసంగానికి అభ్యంతరం చెప్పారు. అవినాశ్‌ మైక్‌‌ను టీడీపీ నేతలు లాగేసుకునేందుకు ప్రయత్నించగా వారిని చంద్రబాబు వారించారు. అదే సమయంలో అవినాశ్ మైక్‌ను కట్ చేయడంతో ఆయన ఏం మాట్లాడారో వినిపించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here