అనూహ్య నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. ఈరోజే ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు ఏమంత బాగోలేవు. ఇప్పటికే ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే మనల్ని మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మీద కోపంతో ఉన్నారు తెలుగు ప్రజలు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తోంది టీడీపీ. ఇప్పటికే రాజీనామాలు కూడా చేశారు మన ఎంపీలు..! అందుకు నిరసనగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినా టీడీపీ ఇంకా ఎన్డీయేలోనే కొనసాగుతుండగా, తాజాగా అందులోంచి కూడా బయటకు రావాలని టీడీపీ నిర్ణయించింది.

ఈ అనూహ్య నిర్ణయం గురించి నేడు స్పష్టత రాబోతున్నట్లు తెలుస్తోంది. నేడు జరగనున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. ఎన్డీయే నుంచి కూడా బయటకు రావాలని నిర్ణయించారు. నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై పూర్తిస్తాయిలో చర్చించిన తర్వాత ఎన్డీయేతో తెగదెంపుల విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here