యాపిల్ కి ముచ్చెమటలు పట్టిస్తున్న తెలుగు అక్షరం ‘జ్ఞ’.. టైప్ చేస్తే యాపిల్ ఫోన్ ఏమైపోతుందంటే..!

యాపిల్ బ్రాండ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఇక ఆ కంపెనీ తయారు చేసే గ్యాడ్జెట్ల కోసం అయితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక యాపిల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. అయితే ఓ తెలుగు అక్షరం మాత్రం యాపిల్ ను ఇప్పుడు తెగ ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడేదిరా అని యాపిల్ కి ముచ్చెమటలు పడుతున్నాయి.

ఐఫోన్లకు ఇప్పుడు ఒక తెలుగు అక్షరం వల్ల కొత్త సమస్య ఏర్పడింది. తెలుగు భాషలో అరుదుగా వాడే ‘జ్ఞా’ అనే ఈ ఒక్క అక్షరం వల్ల ఫోన్లో సామర్ధ్యాన్ని పూర్తిగా నెమ్మదించేలా చేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐవోఎస్‌ 11.2.5 వెర్షన్ వాడుతున్న వారు ‘జ్ఞ’ అక్షరాన్ని టైప్‌ చేసి పంపేందుకు యత్నిస్తే ఆ యాప్‌ క్రాష్‌ అవుతోంది. ఈ అక్షరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఐవోఎస్‌ 11.3లో దీన్ని ఫిక్స్‌ చేసినట్లు అంటున్నారు. త్వరలో దీన్ని పరిష్కరిస్తామని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఓ తెలుగు అక్షరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని తొలిసారిగా ఇటాలియన్ బ్లాగ్ రిపోర్ట్ చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here