బుల్లితెర నటుడు బాలాజీ చేసిన మోసం బయటకు.. సాక్షాధారాలతో..!

బుల్లితెర నటుడు బాలాజీ.. పలు సీరియల్స్ లో నటించాడు.. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన నటనకు కాస్త దూరమయ్యారనే చెబుతున్నారు. ఇంతలో ఆయన చేసిన ఓ ఘరానా మోసం బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో భార్యకు కిడ్నీ మార్పిడి చేయించుకొని.. ఆమెను ఆ తర్వాత కనీసం పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సాక్ష్యాలు ఉన్నాయని తేలింది.

బాలాజీ మోసం చేసినట్లు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యం అయ్యాయి. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 420తో పాటు మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని సెక్షన్ 19 ప్రకారం శిక్ష నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు బదిలీ చేశారు.

బాలాజీ కిడ్నీ దాతకోసం సంప్రదిస్తుండగా డబ్బు అవసరమైన భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ.3 లక్షల నగదును భాగ్యలక్ష్మికి బాలాజీ అందజేశాడు. ఆ తర్వాత ఆమె కిడ్నీ దానం చేయడంతో తన భార్యను బతికించుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని బాలాజీని కిడ్నీదాత సంప్రదించగా, ఆమెను బెదిరించసాగాడు. దీంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here