న‌లుగురు గాయాల‌పాలు కావ‌డానికి కార‌ణ‌మైన తెలుగు టీవీ యాంక‌ర్ కారు

తెలుగు టీవీ యాంక‌ర్ ప్ర‌యాణిస్తోన్న కారు రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మైంది. ఆయ‌న‌ ప్ర‌యాణిస్తోన్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న ఆటోలో ప్ర‌యాణిస్తోన్న న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. అది యాంక‌ర్ లోబో ప్ర‌యాణిస్తోన్న కారు. ప్ర‌మాద స‌మ‌యంలో లోబో కారులో ఉన్నారు. ఆయ‌న‌కూ గాయాల‌య్యాయి.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జ‌న‌గాం జిల్లా ర‌ఘునాథ ప‌ల్లి మండ‌లం నేర‌డిగొండ జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. వరంగల్ అర్బ‌న్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల్లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క కేంద్రాలైన‌ రామప్ప, భద్రకాళి చెరువు, లక్నవరం, వేయి స్తంభాల గుడి ప్రాంతాల్లో యాంకర్‌ లోబో, అత‌ని టీమ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

 

వారు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో లోబోతో పాటు ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ వంశీప్రియకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న కెమెరామెన్లు బాపూజీ, సుధాకర్‌లు సురక్షితంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here