వేలంటైన్స్ డే స్పెష‌ల్‌: భార్య‌కు గుడి క‌ట్టాడు! రోజు కూలీ డ‌బ్బుల‌తో నిత్య‌పూజ‌లు!

చామ‌రాజన‌గ‌ర: వివాహేత‌ర సంబంధాల‌తో క‌ట్టుకున్న భార్య‌ల‌ను హ‌త‌మార్చుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో..ఏనాడో చ‌నిపోయిన భార్య‌కు గుడి క‌ట్టాడో వ్య‌క్తి. దిన‌స‌రి వేత‌న కూలీగా త‌న‌కు వ‌చ్చే డ‌బ్బుల‌తోనే ఆమె విగ్ర‌హానికి నిత్య‌పూజ‌లు చేస్తున్నాడు.

క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ న‌గ‌ర జిల్లా య‌ల్లందూరు తాలూకాలోని కృష్ణాపుర‌లో ఉందీ ఆల‌యం. రాజు అనే వ్య‌క్తి ఈ గుడి క‌ట్టాడు. 15 ఏళ్ల కింద‌ట రాజ‌మ్మతో అత‌నికి వివాహ‌మైంది. అయిదేళ్ల కింద‌ట ఆమె అనారోగ్యానికి గురై మ‌ర‌ణించారు.

దీనితో రాజు తొలుత డిప్రెష‌న్‌కు గుర‌య్యాడు. అందులో నుంచి తేరుకున్న త‌రువాత‌.. గుడి క‌ట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాడు. దీనికోసం రోజూ 12 గంట‌ల పాటు కూలి చేసేవాడు. త‌న అవ‌స‌రాల కోసం పోగా, మిగిలిన మొత్తాన్ని కూడ‌బెట్టుకుని ఏడాది కింద‌ట ఈ గుడిక‌ట్టాడు.

త‌న భార్య రూపు, రేఖ‌లు వ‌చ్చేలా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ విగ్ర‌హానికి రోజూ పూజ‌లు చేస్తుంటాడు. రోజూ ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హార‌తులు ఇస్తుంటాడు. రాజ‌మ్మ విగ్ర‌హాన్ని ద‌ర్శించుకోనిదే తాను ఏ ప‌నీ చేయ‌న‌ని చెబుతున్నాడు రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here