పాపం.. కొన్ని వేల స్టార్ ఫిష్ లు.. గుట్టలు గుట్టలుగా తీరంలో వచ్చి పడ్డాయి..!

ప్రస్తుతం ఐరోపా దేశాలు మంచు దెబ్బకు విలవిలలాడుతూ ఉన్నాయి. మనుషులు ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉన్నారు కానీ పాపం అన్యాయంగా ఎన్నో జంతువులు చనిపోతూ ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి వందలు.. వేల సంఖ్యలో చనిపోతున్నాయి. ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉండడంతో తల్లడిల్లిపోతున్నాయి.

బీస్ట్ ఫ్రమ్ ది ఈస్ట్, స్టార్మ్ ఎమ్మా దెబ్బకు ఇప్పటికే బ్రిటన్ తీరానికి ఎన్నో సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోయి కొట్టుకొని వచ్చాయి. ఇప్పుడు అక్కడ కొన్ని వేల స్టార్ ఫిష్ ను చనిపోయి తీరానికి కొట్టుకొచ్చిన దృశ్యాలు అందరికీ భయాన్ని కలుగజేస్తున్నాయి. ఎన్నో సముద్ర జీవరాశులు చనిపోయి తీరంలోకి కొట్టుకొచ్చాయని వాటిని చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని వేల స్టార్ ఫిష్ లు చనిపోయి అక్కడ ఓ గుట్టలాగ పేరుకుపోయాయి. నత్తగుళ్ళలు, సీగల్స్ పక్షులు కూడా చనిపోయి పడున్నాయి. బ్రిటన్ లోని చాలా తీర ప్రాంతాల్లో ఇదే చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా చాలా సముద్రజీవులు ప్రాణం లేకుండా పడి ఉన్నాయి.

‘బీస్ట్ ఫ్రమ్ ది ఈస్ట్’ దెబ్బకు ఐరోపా దేశాలు సతమతవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ చాలా ఇబ్బందిపడుతోంది. ఇప్పటికే పలు స్కూళ్ళకు సెలవులు ప్రకటించేశారు. ట్రాఫిక్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్ల మీద దట్టమైన మంచు కూడా చుట్టేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here