10వ తరగతి అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి.. సికింద్రాబాద్ లో జవాన్ కూతురిని కూడా వదలలేదు..!

స్నేహితుణ్ని కలిసి ఇంటికి తిరిగెళుతున్న 10వ తరగతి అమ్మాయిపై అత్యాచారం చేశారు. అది కూడా నోటిలో గుడ్డలు కుక్కి.. కట్టెలతో కొట్టి.. స్పృహ తప్పేలా చేసి.. ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని తిరుమలగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న ఓ మిలటరీ జవాన్ కుమార్తె 10వ తరగతి చదువుతోంది. అమ్ముగూడ వద్ద ఆమె తన స్నేహితుణ్ని కలిసి తిరిగి వెళుతుండగా.. రైలు పట్టాల సమీపంలో ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. బాలికను అపహరించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కిరాతకుడు.. ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆమె ప్రతిఘటించడంతో కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత బాలికను అత్యాచారం చేశాడు.

బాలికను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది.బాధితురాలి స్నేహితుడే అత్యాచారానిక పాల్పడ్డాడా లేదా ఆమె కదలికలను గమనించి మరెవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here