చిన్నప్పటి నుండి ఆ సింహాన్ని పెంచింది అతడే.. కానీ..!

చిన్నప్పటి నుండి.. సింహం పిల్లను తీసుకొని వచ్చి పెంచాడు.. కానీ అదే అతడి మీదకు దాడి చేసింది. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్ కు ఓనర్ అయినటువంటి మైక్ హాడ్జ్ పై సింహం దాడి చేసి గాయపరిచింది. ఇప్పుడు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు రికార్డ్ చేశారు.

సౌత్ ఆఫ్రికాలో ఉన్న వైల్డ్ లైఫ్ పార్క్ నిర్వహణను 67 ఏళ్ల మైక్ హాడ్జ్ చూసుకుంటూ ఉన్నాడు. మార్కేలే ప్రెడెటర్ పార్క్ లో ఎన్నో జంతువులను ఆయన చేరదీస్తూ వస్తున్నాడు. అందులో ఓ మగ సింహాన్ని కూడా పెంచాడు. చిన్నప్పటి నుండి అది పిల్లగా ఉన్న వయసు నుండి దాని బాగోగులు చూసుకున్నాడు మైక్. అయితే ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా అతడి మీద దాని చేసింది. అనిమల్ ఎంక్లోజర్ ఉన్న అతడు బయటకు వస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఆ సింహం దాడి చేసింది. వెంటనే అతన్ని లాక్కుపోయింది. అక్కడే ఉన్న సందర్శకులు కాపాడండి.. కాపాడండి అంటూ అరిచారు. వెంటనే ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరపగా.. సింహం మైక్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మైక్ ను ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here