న‌డుం కిందిభాగంలో పూసుకునే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో న‌టించినందుకు మోడ‌ల్ అరెస్ట్‌!

బోట‌మ్‌..అంటే న‌డుం కిందిభాగంలో పూసుకొనే ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్ర‌మోష‌న్‌కు సంబంధించిన యాడ్ అది. ఇలాంటి యాడ్స్‌పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.

అలాంటి ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి రూపొందించిన యాడ్‌లో న‌టించిన ఓ మోడ‌ల్ అరెస్ట‌య్యారు. ఈ ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. ఈ యాడ్‌లో భాగంగా.. ఆమె అర్ధ‌న‌గ్నంగా న‌టించారు.

ప్యాంట్ విప్పేసి, న‌డుం కిందిభాగంలో ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను అప్ల‌య్ చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను విడుద‌ల చేసిందా సంస్థ. ఆ మోడ‌ల్ పేరు నిఠ్ఠాన్‌క‌ర్న్ నున్థాసుతీప‌ట్‌.

25 సంవ‌త్స‌రాల ఈ మోడ‌ల్‌కు థాయ్‌లాండ్ మోడ‌లింగ్‌లో మంచి పేరే ఉంది. త‌మ ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రొడ‌క్ట్ మార్కెటింగ్ చేయ‌డానికి ఆ మోడ‌ల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా.. ఈ వీడియోను తీశారు. ప్యాంట్ విప్పేసి, న‌డుం కిందిభాగంలో క్రీమ్ పూసుకుంటూ క‌నిపించిన దృశ్యాల ప‌ట్ల వ్య‌తిరేక‌త ఎదురైంది. దీనితో ఆమెను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here