205 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న ‘సీ డ్రాగన్’ జీవి శిలాజం దొరికింది..!

మనుషులకు ముందు ఎన్నో జీవ రాషులు మన గ్రహం మీద తమ ఆధిపత్యాన్ని చెలాయించాయి. కొన్ని భూమి మీద.. మరికొన్ని నీటిలో సంచరించాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు అప్పుడప్పుడు లభిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు బ్రిటన్ లో 205మిలియన్ల సంవత్సరాల క్రితం నీటిలో బ్రతికిన ఓ జీవికి సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి. దాన్ని సీ డ్రాగన్ అని అంటున్నారు.

దీని పొడవు దాదాపు 85 అడుగులు ఉంటుందట. బ్రిటన్ లోని లిల్ స్టాక్ బీచ్ లో శిలాజాల మీద ఎప్పటి నుండో పరిశోధనలు జరుపుతున్న ‘పాల్ డి లా సాలే’ దీన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న నీలి తిమింగలం అంత పరిణామంలో ఇది ఉండేదని ఆయన చెప్పారు. ఈ జీవికి సంబంధించిన దవడ భాగం దొరికింది.. అలాగే మరిన్ని ఎముకలు కూడా వాళ్లకు లభించాయి. దీన్ని ఇకిటియోసార్ అని పిలిచేవారు.. గతంలో లభించిన వాటికంటే ఇవి పెద్దగా ఉండడంతో.. రీసర్చర్లు ఆశ్చర్యపోతున్నారు. తమకు దొరికిన ఎముకలు రాళ్ల లాగా అనిపిస్తూ ఉన్నాయని.. కానీ ఇకిటియోసార్ దవడ ఎముకలని పాల్ చెప్పారు. అలాగే మరికొందరు నిపుణులను ఆయన కలిశారు.. వారితో సంప్రదించి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు.

ఇవి ఒకప్పుడు సముద్రంలో రాజ్యం ఏలాయని వారు చెబుతున్నారు. ఇది తన దవడలతో పెద్ద పెద్ద సముద్ర జీవులను పట్టుకునేదని చెప్పారు. దాదాపు 22 మైళ్ళ వేగంగా ప్రయాణించగలిగేవని చెబుతున్నారు. ఇవి దాదాపు 250 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతుకుతూ వచ్చాయి.. 20 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒక్క డైనోసార్ అనేది కూడా లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here