ఇతను ఎవరో తెలుసా..?

ఇప్పటి వరకూ మనం బ్రిటీష్ వాళ్ళంటే తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే అనుకుంటూ ఉంటాం.. కానీ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి బ్రిటీష్ వాళ్ళకు ఆద్యుడు..! తొలితరం ఆంగ్లేయులు నలుపు రంగులో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగి ఉన్నారని బయటకు వచ్చింది. బ్రిటన్ కు చెందిన అతి పురాతన మానవ కళేబరంపై జరిపిన పరిశోధనల్లో ఇది తేలింది.

బ్రిటన్ లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతి పురాతన మానవ కళేబరంపై శాస్త్రవేత్తలు డీఎన్ఏ పరీక్షలను, ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ను నిర్వహించడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన ఈ వ్యక్తి ఎముకలపై తొలిసారిగా అత్యంత ఆధునికమైన జన్యు పరీక్షలు నిర్వహించారు. అతన్ని ‘చెద్దార్ మ్యాన్’ గా పిలిచారు. ఆయన ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగి ఉన్నారని పరీక్షల్లో వెలుగు చూసింది. అతడి చర్మం నలుపు అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కలక్రమేణా వారి చర్మం రంగు మారి ఉండవచ్చని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్, నేచురల్ హిస్టరీ మ్యూజియంలు నిర్వహించిన జన్యు పరీక్షల్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి.

ఈ మానవ కళేబరం చెద్దార్ లోయలో 1903లో లభించింది. చనిపోయినప్పుడు అతడి వయసు ఓ 20 సంవత్సరాలు ఉంటుందని ఈ రీసర్చ్ కి లీడర్, ప్రొఫెసర్ అయిన ఇయాన్ బార్నెస్ తెలిపారు. ఇతడి జెనెటిక్ లక్షణాలు స్పెయిన్, హంగేరీ, లక్సెంబర్గ్ వాసుల్లో కనిపించాయని వారు తెలిపారు. ఇతడికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఛానల్ 4 ఫిబ్రవరి 18న ప్రసారం చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here