దుబాయ్ లోని ఈ హోటల్ కు వెళ్ళే గెస్ట్ లకు బంగారు ఐప్యాడ్ ఇస్తారట..!

దుబాయ్ లో ఉన్న ‘బుర్జ్ అల్ అరబ్’ హోటల్ ప్రపంచంలోనే రిచ్ హోటల్.. అదేనండీ బాగా బిల్లు వేసే హోటల్ లో ఒకటి.. అంటే అందులో ఉండే సదుపాయాలు కూడా అలాగే ఉంటాయని అనుకోండి. ఇప్పుడు ఆ హోటల్ లో గది తీసుకొనే వాళ్లకు బంగారు ఐప్యాడ్ ఇస్తారట. www.jumeirah.com కథనం ప్రకారం ఈ హోటల్ లో గదిని బుక్ చేసుకున్న అతిథులకు 24 క్యారెట్ల బంగారు ఐప్యాడ్ ఇస్తారట. ఈ ఐప్యాడ్ మీద యాపిల్ లోగోతో పాటుగా బుర్జ్ అల్ అరబ్ లోగో కూడా ఉంటుందట. తమ హోటల్ గదిలో ఉన్నందుకు గుర్తుగా ఐప్యాడ్ ను ఇస్తారు.

అరబ్బీ భాషలో బుర్జ్ అంటే టవర్ అని అర్థం. బుర్జ్ అల్ అరబ్ అంటే అరబ్బుల టవర్ అని.. ఈ హోటల్ ని దుబాయ్ కి ఓ ప్రత్యేక ఆకర్షణగా చెబుతూ ఉంటారు. అలాగే ప్రపంచం లోని మూడో పెద్ద హోటల్ ఇదే కావడం విశేషం. ఈ హోటల్ ను దుబాయ్ లో కాదు.. దుబాయ్ బయట కట్టించారు. ఓ చిన్న దీవిలో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ లో మొత్తం 202 గదులు ఉన్నాయి. కొన్ని గదులు 1820 చదరపు అడుగులు ఉంటే.. మరికొన్ని 8400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.

గదులు కూడా చాలా కాస్ట్లీనే అండోయ్..! అందుకే అక్కడ గోల్డెన్ ఐప్యాడ్ ఇచ్చేది. ఈ హోటల్ లో ఎన్నో అత్యాధునిక వసతులతో కూడిన గదులు ఉన్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లు ఇక్కడే విడిదిచేస్తూ ఉంటారు. చాలా సినిమాలు కూడా ఇక్కడ తెరకెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here