ఈమె విషయంలో విధి ఆడిన వింతనాటకం.. చితిపైన ఊపిరి తీసుకుంది.. కానీ..!

విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో.. ఇక్కడ చూస్తున్న ఈ మహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చాక ఆ మహిళ ఊపిరి తీసుకోవడంలేదని.. చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తీ చేశారు. కానీ ఆమెను చితి మీద పడుకొని పెట్టగానే ఆమె ఊపిరి తీసుకుంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ ఎక్కించారు. అలా ఎక్కించిన ఆమెకు ఆక్సిజన్ ను అందిస్తూ వెళుతున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఆసుపత్రికి చేరుతుంది అనగా అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. దీంతో ఆమె మార్గమధ్యమంలోనే చనిపోయింది. చనిపోయింది అని అనుకున్న మహిళ.. బ్రతికిందని తెలియడం.. బ్రతికిందని తెలిసిన కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ చనిపోవడం నిజంగా ఇది ఆ దేవుడు ఆడే ఆట..!

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అరవింద్ అహిర్వార్ భార్య భగవతిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు డెలివరీ కోసం తీసుకొని వెళ్ళారు. ఓ రెండు గంటల తర్వాత ఆమె ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. కానీ సాయంత్రం 5 గంటలకు ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపి ఆమె శవాన్ని ఇంటికి పంపించేసారు. ఆమె చనిపోయిందని అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేశారు. కానీ ఆమె ఒంట్లో వేడి ఇంకా ఉందని గమనించిన కుటుంబసభ్యులు ఆమె ఇంకా బ్రతికే ఉందని గమనించారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు.

అంబులెన్స్ లో ఆమెను ఎక్కించారు. అలా ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళే సమయంలో అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. దీంతో ఆమెను చనిపోయింది. మరోసారి ఆమెను చూసిన వైద్యులు చనిపోయిందని తేల్చేశారు. దీంతో ఆ కుటుంబంలో మరోసారి విషాదం అలముకుంది. డాక్టర్లు సరైన చికిత్స చేసి ఉండి ఉంటే తన భార్య బ్రతికి ఉండేదని భర్త ఆరోపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here