ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.. గుర్రం రక్తం కూడా వంటల్లో భాగమే.. కనురెప్పలు కూడా గడ్డకట్టుతాయి..!

కాస్త చలికే మనం అల్లాడిపోతున్నాం. ఉదయం 9 అయినా సూర్యుడి జాడ కనిపించడం లేదని తెగ బాధపడిపోతున్నాం. అలాంటిది ఈ గ్రామం వాళ్ళు ఏమని చెప్పుకోవాలో.. ఎవరికీ చెప్పుకోవాలో వారి బాధని.. ఎందుకంటే ఆ గ్రామంలో నమోదైన ఉష్ణోగ్రత ఎంతంటే -62 డిగ్రీలు. సైబీరియా లోని గ్రామమైన ఒయ్ మ్యాకన్ లో ప్రతి ఒక్కటీ గడ్డకట్టి పోతుంది. చివరికి మీ కనురెప్పలు కూడానూ..!

ఒయ్ మ్యాకన్ ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.. అక్కడ దాదాపు 21గంటల పాటూ మబ్బులే ఉంటాయి. ఓ మూడు గంటలు సూర్యుడు కనిపిస్తే కనిపిస్తాడు.. లేదంటే అది కూడా లేదట..! ఇక్కడ నమోదవుతున్న చల్లని ఉష్నోగ్రతలకు థర్మోమీటర్ కూడా పగిలిపోయింది. ఒయ్ మ్యాకన్ లో కేవలం 500 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు.

ఇక్కడకు చేరుకోవడం చాలా కష్టం.. విమానాలు చలికాలంలో ఇక్కడకు రాలేవు. అలాగే దీనికి దగ్గరగా ఉన్న పెద్ద నగరం యాకుత్స్క్ నుండి ఇక్కడకు కారులో చేరుకోవాలంటే దాదాపు రెండు రోజులు పడుతుందట. రోడ్డు నిండా వర్షమే..! ఇక్కడ రొటీన్ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుందట. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడూ వారి కార్ల ఇంజన్లు రన్నింగ్ లోనే ఉంటాయట. అలాగే ఈ వాతావరణానికి పంటలు అసలు పండవు. చాలా భాగం వరకూ వారు గడ్డకట్టిన మాంసాన్ని తినే బ్రతుకుతారు. చేపలు, మకరోనీ, గుర్రం రక్తంతో చేసిన ఐస్ క్యూబ్స్ ను వంటల్లో వాడుతూ ఉంటారు. ఎంత చలిగా ఉంటుందంటే అక్కడ చేపలు అమ్మే వాళ్ళు.. వాటిని ప్రత్యేకంగా ఫ్రిడ్జ్ లలో దాచాల్సిన అవసరం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here