ఈ కారును సొంతం చేసుకోవాలంటే 14కోట్లకు పైనే ఖర్చు చేయాలి.. ఏముంది ప్రత్యేకత..!

ఈ కారును చూశారా.. అచ్చం బ్యాట్ మ్యాన్ సినిమాలో హీరో వాడే కారులా అనిపించడం లేదూ.. ఇది ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన ఎస్.యు.వీ. వాహనం అట..! దీని ధర 14కోట్లకు పైగానే నిర్ణయించారు. కార్ల్ మన్ కింగ్స్ కంపెనీ ఈ కారును తయారు చేసింది. కేవలం 10 కార్లను మాత్రమే ఈ కంపెనీ తయారుచేసిందట. ఇక ఇందులోని ఇంటీరియర్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. కారు లోపల లగ్జరీ సీట్లు.. వీడియో గేమ్ ఆడుకునే సదుపాయం.. షాంపేన్ ఉంచడానికి ఫ్రిడ్జ్.. ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. అద్భుతమైన ఇంటీరియర్ ఈ కారు సొంతం.

ఈ కారు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. కారు బాడీని కార్బన్ ఫైబర్ మరియు స్టీల్ తో తయారు చేశారు. అంతే కాదండోయ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా..! కారు లోని చాలా సదుపాయాలను మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా వాడేసుకోవచ్చు. దీని బరువు 4.5 టన్నులు. బుల్లెట్ ప్రూఫ్ తయారు చేస్తే ఆరు టన్నుల బరువు కూడా ఉంటుంది. రోమన్ రాజు అయిన కార్లోమన్ 1 పేరు మీద ఈ కారుకు పేరు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here