స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడ‌ల్ సాధించిన యువ‌తిపై లైంగిక వేధింపులు

శివ‌మొగ్గ‌: స‌్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో బంగారు ప‌త‌కాల‌ను సాధించిన ఓ యువ‌తి లైంగిక వేధింపుల‌కు గుర‌య్యారు. ఓ డాక్ట‌ర్‌ను త‌న‌ను మోస‌గించాడ‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బెంగ‌ళూరులోని సెయింట్ జాన్స్ ఆసుప‌త్రిలో ప‌నిచేసే డాక్ట‌ర్ ఆకాశ్ అవ‌టి త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని, ఆపై పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, లోబ‌ర‌చుకున్నాడ‌ని ఆమె పోలీస్‌స్టేష‌న్‌లో లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు ఇచ్చారు.

బాధిత యువ‌తి మ‌హారాష్ట్రలోని కొల్లాపూర్ నివాసి. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండ‌గా.. ఓ మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా ఆకాశ్ ప‌రిచ‌యం అయ్యాడు. ఆరునెల‌ల పాటు స‌న్నిహితంగా ఉన్న ఆకాశ్.. పెళ్లి పేరుతో త‌న‌ను మోసం చేశాడ‌ని, శారీర‌క సంబంధాన్ని కొన‌సాగించాడ‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్లుగా త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని చెప్పారు.

అదే స‌మ‌యంలో- శివ‌మొగ్గ‌కు చెందిన మ‌రో యువ‌తితో పెళ్లికి సిద్ధ‌ప‌డుతున్నాని, నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని అన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న త‌రువాత తాను మ‌హారాష్ట్ర పోలీసుల‌తో క‌లిసి శివ‌మొగ్గ‌కు రాగా.. అత‌ను ప‌రార‌య్యాడ‌ని చెప్పారు. శివ‌మొగ్గ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here