మార్చి 2 నుండి సినిమా థియేటర్ల మూసివేత.. అందుకు కారణం..!

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్‌పీలు) క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థల ప్రతినిధులతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల ఐకాస శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు.

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ బంద్ వాటి విడుదలపై ప్రభావం చూపనుంది. వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దక్షిణాది సినిమా థియేటర్లలో ఓ ప్రాంతీయ సినిమా ప్రదర్శనకు ఒక్కో స్క్రీన్‌కు సుమారు రూ.22500 వరకు వీపీఎఫ్‌ను డీఎస్‌పీలు వసూలు చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు భారంగా మారుతోంది. అందువల్ల ఈ రేటును సగానికి తగ్గించాలనేది నిర్మాతల మండలి ప్రధాన డిమాండ్. కానీ వారి డిమాండ్‌కు డీఎస్‌పీలు తగ్గడం లేదు. దీంతో మార్చి 2 నుండి సినిమా థియేటర్లను మూసివేయనున్నారు. బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో ఈ చర్చలు జరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here