సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఇంట్లో చోరీ.. ఎంత సొమ్ము పోయిందంటే!

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఇంట్లో చోరీ జ‌రిగింది. సుమారు నాలుగు లక్షల రూపాయ‌ల న‌గ‌దు చోరీకి గురైంది. దీనిపై మ‌ణిశ‌ర్మ మేనేజ‌ర్ సుబ్బనాయుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌ణిశ‌ర్మ త‌న కుటుంబంతో క‌లిసి ఫిల్మ్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దును బీరువాలో దాచి పెట్టారు.

ఆదివారం ఆ న‌గ‌దు క‌నిపించ‌లేద‌ని బంజారాహిల్స్‌ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. అనుమానితుల‌ను ఇంకా ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేద‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here