10 రూపాయలకే గర్ల్ ఫ్రెండ్ అద్దెకు దొరుకుతుంది.. కండీషన్లు ఏమిటంటే..!

గర్ల్ ఫ్రెండ్ కావాలని.. ఉండాలని సింగిల్ గా ఉన్న అబ్బాయిలు ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారంటే మన వాళ్ళు ఎగిరెగిరి గంతేస్తారు. అయితే ఈ ఆఫర్ మన దేశంలో కాదు.. చైనాలో..! చైనా లోని సింగిల్స్ కోసం ఈ అవకాశాన్ని అందించారు.

హేయువాన్ నగరంలోని విటాలిటీ సిటీ అనే షాపింగ్ మాల్ లో అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్స్ ను రెంట్ గా ఇస్తారు. అది కూడా కేవలం 1RMB మాత్రమే మన కరెన్సీలో కేవలం 10 రూపాయలే. 20 నిమిషాల పాటూ వారిని సొంత గర్ల్ ఫ్రెండ్ లాగా మాల్ లో తిప్పొచ్చు. వారితో ఫోటోలు తీసుకోవచ్చు.. లంచ్ కు పిల్చుకొని వెళ్ళచ్చు. ఒకవేళ 20 నిమిషాలు పూర్తీ అయిందంటే.. ఇంకా ఆ అద్దె గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఇంకొద్దిసేపటికి ఇంకో 10 రూపాయలతో రీచార్జ్ చేసుకోవచ్చు గర్ల్ ఫ్రెండ్ టైమ్ ను.. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదంటే వెళ్ళిపొమ్మని చెప్పొచ్చు.. దీంతో ఆమె ఎక్కడైతే ఉండేదో అక్కడికే వెళ్ళిపోతుంది. మాల్ కు పర్యాటకుల తాకిడిని పెంచడానికి ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టారు.

అయితే కొన్ని కండీషన్లు కూడా ఉన్నాయి.. అదేమిటంటే ఆమెను కేవలం షాపింగ్ మాల్ లో మాత్రమే తిప్పొచ్చు. ఆమెకు ఇష్టం లేకుండా కనీసం తాకడానికి కూడా వీలు లేదట. అంటే ఈ అద్దె గర్ల్ ఫ్రెండ్స్ కేవలం ఫోటోలకే పరిమితమన్నమాట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here