ఏటీఎం ను దోచేద్దామని వెళ్ళిన వ్యక్తి.. భగభగా నిప్పుల్లో మాడిపోయాడు..!

ఏటీఎం ను దోచేద్దామని పలువురు దొంగలు భావిస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు అలాంటి ఘటనలు మనం కళ్ళారా చూశాము కూడా..! అలా ఓ దొంగ ఏటీఎం ను కొల్లగొడదామని ప్రయత్నించి చివరికి భగభగా మండిపోయాడు. ఏటీఎం మెషీన్ ను తెరవాలని అనుకున్న అతడు మంటల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా మారింది.

ఈ ఘటన స్కాట్లాండ్ లో చోటుచేసుకుంది. ఓ గ్యాస్ కటర్ సాయంతో దాన్ని తెరుద్దామని ప్రయత్నించాడు. కానీ అక్కడే అతడు చేసిన పొరపాటు కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి. జనవరి 11 న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పేలుడులో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎగిరిపడి మంటల్లో చిక్కుకున్నాడు.

51సంవత్సరాల ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడం చూసి పోలీసులు క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చారు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. ఈ పేలుడు లో దాదాపు 20 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here