సిగ్గు లేని దొంగ.. చిన్న పిల్లాడి చేతిలో నుండి ఫోన్ కొట్టేశాడు..!

పిల్లాడి చేతిలో నుండి మొబైల్ ఫోన్ కొట్టేసిన సిగ్గు లేని దొంగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఓ పిల్లాడు ఇంటి ముందు మొబైల్ ఫోన్ లో ఆడుకుంటూ ఉండగా దారిన పోతున్న ఓ వ్యక్తి చూశాడు. అయితే ఎంతో సైలెంట్ గా అక్కడికి వచ్చిన ఆ దొంగ.. ఆ పిల్లాడి చేతిలో నుండి ఫోన్ ను లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు.

ఏప్రిల్ 3న వియత్నాం దేశం లోని.. బెన్ హోవా నగరంలో చోటుచేసుకుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ పిల్లాడు మొబైల్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఓ తెలుపు రంగు క్యాప్ వేసుకొని ఉన్న ఓ యువకుడు వచ్చాడు. ఏదో పని మీద వచ్చినట్లు వచ్చి.. పిల్లాడి చేతిలో ఉన్న ఫోన్ ను లాగేసుకున్నాడు. ఆ పిల్లాడు ఏడుస్తూ ఉండిపోయాడు. గ్రే కలర్ టాప్ వేసుకొని వచ్చిన ఆ దొంగను నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్నారు. సిగ్గు లేని దొంగ.. చివరికి చిన్న పిల్లోడి దగ్గర ఉన్న ఫోన్ ను కూడా ఎలా కొట్టేయాలని అనిపించింది అని అంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here