1996 నుండి ఆమె ఇప్పటి దాకా అలాగే ఉందట..!

సాధారణంగా కొన్ని సంవత్సరాలు దాటితేనే ముఖంలో చాలా తేడాలు కనపడతాయి. ఇక ఎప్పుడూ ముఖానికి రంగు వేసుకొనే టీవీ ఫీల్డ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మేకప్ తో కవర్ చేసినా అట్టే తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్న టీవీ రిపోర్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రెండు దశాబ్దాలు పైగా అయినప్పటికీ ఆమె ఏ మాత్రం మారలేదని..!

మీరు ఇక్కడ చూస్తున్న మహిళ పేరు యాంగ్ డాన్.. ఆమె వయసు 44 సంవత్సరాలు.. రెండు దశాబ్దాలకు పైగా ఆమె చైనా సెంట్రల్ టెలివిజన్ సెంటర్ లో వాతావరణ విశేషాలను చెబుతూ ఉంది. 1996లో ఎలా ఉందో.. 2018లో కూడా ఆమె అలాగే ఉండడంతో నెటిజన్లు అసలు నమ్మలేకపోతున్నారు. ఆమెలో కొంచెం కూడా వయసు మార్పులు రాకపోవడం విశేషం.

చైనా సోషల్ మీడియాలో ఆమె వీడియో తెగ వైరల్ అయిపోతోంది. 1996లో ఆమె వార్తలు చెప్పినప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి ఒక్క సంవత్సరానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన కాలం నుండి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన సమయం వరకూ ఆమెలో ఎటువంటి మార్పులూ లేవని అంటున్నారు నెటిజన్లు. ఆమె ఆ టీవీ ఛానల్ లో రెండు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here