గంటకు ఎనిమిది లక్షలు సంపాదిస్తుంది.. ఏ ఉద్యోగం చేయకుండానే..!

భారతీయుల తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక ఓ ఉద్యోగం చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే చాలు తమ పిల్లల అన్ని అవసరాలూ తీరిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. మొదట తక్కువ శాలరీ సంపాదించినా.. ఆ తర్వాత ఎలాగూ ఎదుగుతాడులే అనేది వారి ఆశ..! మొదట్లో జీతం వేలల్లో ఉన్నా.. ఆ తర్వాత లక్షల్లోకి వెళుతుందిలే అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ చూస్తున్న యువతి ఉద్యోగం చేయదు.. గంటకు లక్ష రూపాయలు సంపాదిస్తుంది. ఈ మాట వింటేనే షాక్ అవుతున్నారు కదూ..!

గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏంటి.. ఆ సంపాదన ఏంటి అని మనం అనుకోవచ్చు.. అంతే.. ఆమె రేంజే అంత..! ఇంతకూ ఆమె ఏమి చేస్తుందనే కదా మీ డౌట్.. జస్ట్ గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఆమె ఓ గంట పాటూ ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ స్ట్రీమ్ చేయాలి అంతే ఎనిమిది లక్షల రూపాయలు ఆమె ముంగిట వాలుతాయి.

ఆస్ట్రేలియాకు చెందిన ఈ యువతి పేరు చెల్సీ.. ఈమె ఓ గేమర్.. ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఫార్మసీ స్టూడెంట్ అయిన చెల్సీకి కంప్యూటర్స్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా కంప్యూటర్ గేమ్స్ అన్నా ఎగిరిగంతేస్తుంది. అలా గేమింగ్ వరల్డ్ లోకి వచ్చిన చెల్సీ ఆ తర్వాత ఆ గేమింగ్ వరల్డ్ లో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె గేమ్ ఆడుతూ ఉంటే కొన్ని వేల మంది ఆన్ లైన్ లో చూస్తూ ఉంటారు. ఆమె లైవ్ స్ట్రీమింగ్ కోసం సబ్ స్క్రిప్షన్ చేసుకున్నారంటే ఆమెకు డబ్బులు వస్తూ ఉంటుంది. అలాగే ఆమె గేమ్ ఆడుతున్నప్పుడు చూసే వాళ్లకు అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తూ ఉంటాయి.. ఆ సమయంలో ఈమెకు డబ్బులు వస్తాయి.. అలా గంటకు ఎనిమిది లక్షల రూపాయలకు పైగా చెల్సీ సంపాదిస్తూ ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here