తొలి కిరణం డిసెంబర్ 14న విడుదల 

సువర్ణ క్రియేషన్స్ పతాకం పై బేబీ మేరీ విజయ సమర్పణం లో నిర్మిస్తున్న చిత్రం తొలి కిరణం. యేసు క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా, వినూత్నంగా నిర్మించబడిన చారిత్రాత్మక చిత్రం తొలి కిరణం. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 14న విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 7న దర్శకుడు జె. జాన్ బాబు జన్మదిన సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో సీనియర్ దర్శకులు సాగర్ గారు, బెనర్జీ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గున్నారు.

ఈ  సందర్భంగా దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ ‘తొలి కిరణం చాలా కష్టపడి నిర్మించాం. ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 14 న ప్రపంచవేప్తంగా  విడుదల చేస్తాము’ అని తెలియజేసారు.

యేసు క్రీస్తు గా నటించిన పిడి రాజు మాట్లాడుతూ ‘ఈ రోజు మా దర్శకుడు జాన్ బాబు గారి పుటిన రోజు వారికీ నా శుభాకాంక్షలు. సినిమా చాల బాగా వచ్చింది. చాలా కష్టపడి నటించాము. డిసెంబర్ 14 న విడుదల అవుతుంది. మీరు అందరు ఆదరిస్తారు’ అని కోరుకున్నారు.

మరి మాతగా నటించిన నటి మాట్లాడుతూ ‘ఈ సినిమా లో నటించడం గొప్ప వరం. డైరెక్టర్ జాన్ బాబు గారికి నా కృతఙ్ఞతలు. సినిమా డిసెంబర్ 14 న విడుదలవుతుంది. మీరు అందరు మా సినిమా ని విజయం చేస్తారు’ అని కోరుకున్నారు.

బెనర్జీ మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా నాచురల్ గా  ఉంది. యేసు క్రీస్తు వాళ్ళని ఆశీర్వదించాడు జాన్ బాబు గారు సినిమా తీసాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాదించాలి. ఇలాంటి  సినిమాలు మన తర్వాతి సమాజానికి చాలా అవసరం. భగవంతుడు ఈ సినిమా ని ఆశిర్వదించాలి’ అని కోరుకున్నారు.

ఈ చిత్రానికి ఆర్ పి పట్నాయక్ అందించారు. కథ, మాటలు, VMM ప్రణీత , ప్రభు కిరణ్ సమర్పకులు, చంద్ర బోస్ పాటలు వ్రాసారు. కెమెరా  ఏం మురళి. స్క్రీన్ ప్లే, దర్శకత్వం జె జాన్ బాబు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here